Monday, November 9, 2020

SSC Recruitment 2020

  NewNotifications       Monday, November 9, 2020

ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఇటీవల కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ ఇది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. లోయర్ డివిజనల్ క్లర్క్-LDC, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్-JSA, పోస్టల్ అసిస్టెంట్-PA, సార్టింగ్ అసిస్టెంట్-SA, డేటా ఎంట్రీ ఆపరేటర్-DEO లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మరి ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL ఎగ్జామినేషన్‌కు అప్లై చేయడానికి రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి వన్‌ టైమ్ రిజిస్ట్రేషన్. రెండోది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అవసరం. వీటికి ఓటీపీ వస్తాయి. ఆధార్ నెంబర్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజ్ లేదా స్కూల్ ఐడీ, ఎంప్లాయర్ ఐడీ లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి. అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను 14 రోజుల్లో పూర్తి చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావొచ్చు. లాగిన్ అయిన తర్వాత మీ వివరాలు డిస్‌ప్లే కనిపిస్తాయి. ఆ వివరాలను ఎడిట్ చేయొచ్చు.


వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి. ఇందుకోసం https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. ఆ తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఫీజు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించొచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. 2020 డిసెంబర్ 15 రాత్రి 11.30 గంటల్లోగా అప్లై చేయాలి. 2020 డిసెంబర్ 17 రాత్రి 11.30 గంటల్లోగా ఫీజు చెల్లించాలి.

Official Website && Download the Official Notification

logoblog

Thanks for reading SSC Recruitment 2020

Previous
« Prev Post