DRDO Recruitment 2020
డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలతో పాటు నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో డీఆర్‌డీఓకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో 90 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు చండీగఢ్‌లోని డీఆర్‌డీఓకు చెందిన స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 12 చివరి తేదీ. దరఖాస్తు ఫామ్‌ను డీఆర్‌డీఓ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ ఐడీకి పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోండి.
DRDO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే
మొత్తం జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు- 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 12
ఆన్‌లైన్ ఇంటర్వ్యూ- 2020 అక్టోబర్ 22,23
వేతనం- రూ.31,000
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ
విద్యార్హతలు- మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, జియోమెటిక్స్, జియో ఇన్ఫర్మెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఫారెస్ట్రీ, బాటనీ, అగ్రికల్చర్, ప్లాంట్ ఫిజియాలజీ లాంటి సబ్జెక్ట్స్‌లో డిగ్రీ, పీజీ పాసైనవారు దరఖాస్తు చేయాలి. వీరికి నెట్ లేదా గేట్ తప్పనిసరి.
దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్ ఐడీ: director@sase.drdo.in