IOCLలో 493 అప్రెంటీస్ పోస్టులు
ఈ రోజు నుంచే దరఖాస్తులు ప్రారంభం ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. దాదాపు 493 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు నుంచే ప్రారంభమైంది
నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. దాదాపు 493 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు, పాండిచ్చేరి, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు అప్రెంటీస్ చట్టాలు, నిబంధనల ప్రకారం స్కాలర్ షిప్ ఇవ్వనున్నారు
ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, Machinist పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆయా విభాగాల్లో ITI చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అకౌంటెంట్ పోస్టును కూడా భర్తీ చేస్తున్నారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు 12th పాస్ అయ్యి ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు(నవంబర్ 27)న ప్రారంభమైంది. డిసెంబర్ 12ను దరఖాస్తుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు