ఏపీలో పెరిగిన కరోనా పరీక్షలు.. కొత్తగా 1,031 మందికి పాజిటివ్.. 8 మంది మృతి..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సారి కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించినా, కేసులు మాత్రం స్వల్పంగా నమోదవుతున్నాయి
గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,269 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,031 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,65,705కి చేరుకుంది