Phonepe Job Openings: ఏపీఎస్‌ఎస్‌డీసీ తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది.
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(Phone Pe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది.
ఈ ప్రకటన ద్వారా 75 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.. అలాగే ద్విచక్రవాహనంతో పాటు, ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల (నవంబర్) 25 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ముఖ్య సమాచారం:
- సంస్థ పేరు: ఫోన్ పే
- పోస్టు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- ఖాళీలు: 75
- విద్యార్హత: ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- జీతం: 11,500+PF+ఇన్సూరెన్స్+ఇన్సెంటీవ్స్(రూ. 3000-రూ. 5,000)
- అనుభవం: సేల్స్ విభాగంలో కనీసం ఆరు నెలలు పని చేసిన అనుభవం ఉండాలి.
ప్రాంతాల వారీగా ఖాళీలు:
- చిత్తూరు, తిరుపతి-2
- గుంటూరు అర్బన్-2
- అనంతపూర్-5
- కాకినాడ-7
- కర్నూల్-2
- ప్రకాశం-4
- రాజమండ్రి-2
- విజయనగరం, శ్రీకాకుళం-8
- వెస్ట్ గోదావరి-6
- వైఎస్సార్ కడప-2
- విజయవాడ సెంట్రల్&ఈస్ట్-7
- విజయవాడ వెస్ట్-4
- వైజాగ్-24