Sunday, November 22, 2020

NTPC Recruitment 2020

  NewNotifications       Sunday, November 22, 2020

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. రెండేళ్లు మాత్రమే ఈ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.24,000 స్టైపెండ్ లభిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ntpccareers.net/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

NTPC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 70

  • మైనింగ్- 40
  • ఎలక్ట్రికల్- 12
  • మెకానికల్- 10
  • మైన్ సర్వే- 8

దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 23

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 12

మొదటి దశ ఆన్‌లైన్ టెస్టుకు అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- 2020 డిసెంబర్ చివరి వారం

మొదటి దశ ఆన్‌లైన్ టెస్టు- 2021 జనవరి మొదటి వారం

రెండో దశ ఆన్‌లైన్ టెస్టుకు అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- 2021 జనవరి చివరి వారం

రెండో దశ ఆన్‌లైన్ టెస్టు- 2021 ఫిబ్రవరి మొదటి వారం

NTPC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- మైనింగ్ పోస్టుకు డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైన్ సర్వే పోస్టుకు డిప్లొమా ఇన్ మైన్ సర్వే లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ పాస్ కావాలి. ఈ కోర్సులను 70 శాతం మార్కులతో పాస్ కావాలి. ఫుల్ టైమ్ కోర్స్ పూర్తి చేసినవారే అప్లై చేయాలి.

వయస్సు- 25 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- రెండు దశల ఆన్‌లైన్ టెస్ట్.

స్టైపెండ్- నెలకు రూ.24,000

Notification In EnglishNotificaion In Hindi

logoblog

Thanks for reading NTPC Recruitment 2020

Previous
« Prev Post