Monday, November 23, 2020

Best mobile prepaid plans

  NewNotifications       Monday, November 23, 2020

దేశంలోని అన్ని ప్రధాన టెలికామ్ కంపెనీలు వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఎయిర్‌టెల్, జియో, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఉన్నాయి. అయితే టెలికాం ఆపరేటర్లు రకరకాలు ప్లాన్‌ను అందజేస్తుండటంతో.. వాటిలో బెస్ట్ ఆఫర్లను ఎంపిక చేసుకోవడం వినియోగదారులకు కష్టంగా మారుతుంది. ఈ క్రమంలోనే టెలికామ్ ఆపరేటర్లు రూ. 500కు తక్కువలో అందిస్తున్న ఆన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే భారత్‌లో చాలా మంది వినియోగదారులు 500 రూపాయల లోపే రీచార్జ్ చేయడాని ఆసక్తి చూపుతారు. అంతకు మించి రీచార్జ్ చేయడం భారంగా భావిస్తుంటారు.

బీఎస్ఎన్‌ఎల్.

బీఎస్‌ఎన్‌ఎల్ 500 రూపాయల కంటే తక్కువలో STV_247 బెస్ట్ అన్‌లిమిటెల్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో రోజుకు 3GB డేటా అందిస్తారు. డేటా పూర్తైన తర్వాత స్పీడ్ 80 KBPSకి చేరుతుంది. అలాగే రోజుకు 250 నిమిషాల వరకు ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందవచ్చు. అలాగే ఎరోస్ నై, బీఎస్ఎన్‌ఎల్ ట్యూన్స్ ప్రీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. దీని కాలపరిమితి 40 రోజులు.

జియో

జియో నుంచి రూ. 500 లోపు వాటిలో 444 ప్లాన్ బెస్ట్ అన్‌లిమిటెడ్ బెస్ట్ ప్లాన్. 56 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ప్యాక్‌లో రోజు 2 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 2000 నిమిషాల నాన్ జియో కాలింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అన్ని జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్‌లో రూ. 500 కంటే తక్కువలో 449 ప్లాన్ బెస్ట్ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఇండియాలో ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది. అలాగే రోజుకు 2 GB డేటా, వంద ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. దీని కాలపరిమితి 56 రోజులు. ఈ ప్లాన్ ద్వారా పలు ఓటీటీల బెనిఫిట్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంతో పాటుగా షా అకాడమీ, వింక్ మ్యూజిక్ ఏడాది వరకు ఉచితంగా లభిస్తాయి.వీఐ..

వీఐలో రూ. 500లోపు 449 ప్లాన్ బెస్ట్ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. డబుల్ డేటా ఆఫర్ కింద ఈ ప్లాన్‌లో రోజుకు 4GB డేటా పొందవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్లాన్ కాలపరిమితి 56 రోజులు. ఈ ప్లాన్‌లో వీకెండ్ డేటా రోల్ ఓవర్ కూడా పొందవచ్చు. అలాగే వీఐ మూవీస్‌తో పలు టీవీ యాప్‌లను సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు

logoblog

Thanks for reading Best mobile prepaid plans

Previous
« Prev Post