IOCL Jobs 2020 | ఇంటర్ పాసయ్యారా? డిప్లొమా పూర్తి చేశారా? డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఐఓసీఎల్‌లో 482 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 482 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉంది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్స్‌లో ఈ పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కవర్ అయ్యే సదరన్ రీజియన్ పైప్‌లైన్స్-SRPL తో పాటు వెస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-WRPL, నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్-NRPL, ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-ERPL, సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-SERPL ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైమ్ డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 22 చివరి తేదీ. టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ https://portal.mhrdnats.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పోర్టల్‌లో https://apprenticeshipindia.org/ లో రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత అదే రిజిస్టర్ నెంబర్‌తో https://plis.indianoilpipelines.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
IOCL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే
- మొత్తం ఖాళీలు- 482
- ఆంధ్రప్రదేశ్- 6
- తమిళనాడు- 32కర్నాటక- 3
- గుజరాత్- 90
- రాజస్తాన్- 46+3
- పశ్చిమ బెంగాల్- 44
- బీహార్- 36
- అస్సాం- 31
- ఉత్తరప్రదేశ్- 18+24
- ఒడిషా- 51
- చత్తీస్‌గఢ్- 6
- జార్ఖండ్- 3
- హర్యానా- 43
- పంజాబ్- 16
- ఢిల్లీ- 21
- ఉత్తరాఖండ్- 6
- హిమాచల్ ప్రదేశ్- 3
IOCL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 4
- దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 22 సాయంత్రం 6 గంటలు
- రాతపరీక్ష- 2020 డిసెంబర్ 6
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైమ్ డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్స్‌లో డిగ్రీ పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఇంటర్ పాసైతే చాలు.
పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
వయస్సు- 2020 అక్టోబర్ 30 నాటికి 18 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
అప్రెంటీస్ గడువు- టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్ ఏడాది, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గడువు 15 నెలలు.