Interview Tips:ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా? అయితే ఈ సూచనలు పాటించండి
ప్రస్తుత పరిస్థితుల్లో రెజూమ్ పోస్ట్ చేసినప్పటి నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే వరకు చాలా సమయం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటర్వ్యూ ముందు డిస్కషన్ కే చాలా సమయం పడుతోంది. మరి ఇంటర్వ్యూ ప్రక్రియలో అభ్యర్థులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరైన ఉద్యోగం దక్కించుకోవడం కష్టంగా మారింది. కొలువు కోసం విపరీతమైన పోటీ, ఇంటర్వ్యూ ప్రక్రియ కష్టతరం అవుతుంది. అంతేకాకుండా మరో పక్క కంపెనీలకు తగిన అర్హత ఉన్న అభ్యర్థులు దొరకడం గగనమైంది. సిఫార్సుల ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులు అంచనాలు అందుకోలేక మధ్యలోనే ఆగిపోతుండటం వాస్తవం. కాబట్టి ఇందుకోసం అభ్యర్థులతో పాటు నిర్వాహకులు కూడా ఎంతో కష్టప పడాల్సి వస్తోంది. లింక్డిన్ లాంటి బ్రౌజర్లలో రెజూమ్ పోస్ట్ చేసినప్పటి నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే వరకు చాలా సమయం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పుడుతోంది. ఇంటర్వ్యూ ముందు డిస్కషన్ కే చాలా సమయం పడుతోంది. మరి ఇంటర్వ్యూ ప్రక్రియలో అభ్యర్థులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిర్వాహకుడితో మీ కెమిస్ట్రీ బాగుండాలి
ఇంటర్వ్యూలో సమావేశాలు ఎల్లప్పుడూ వన్ ఆన్ వన్ పద్ధతిలో ఉంటాయి. మీకు ఉద్యోగం పట్ల నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే కమ్యూనికేట్ చేయడానికి, కలుపుగోలుపుతనంగా మాట్లాడానికి ప్రయత్నించాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఇంతకు ముందు కంపెనీ మీ పని అనుభవం, బయట మీ అభిరుచులు తదితర అంశాల గురించి మాట్లాడాలి. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు.. ఎక్కడికి వెళ్లాలని అనుకుంటారు .. లాంటి విషయాలని వారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్వ్యూకు వెళ్లే వారు గమనించాలి.
స్వతంత్రంగా ఆలోచించగలరని తెలియజేయాలి
ఇంటర్వ్యూ ప్రక్రియకు ముందు జరిగే సంభాషణల్లో అడిగేది లక్ష్యం గురించిది. లక్ష్యాల పట్ల ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు? వాస్తవికమైన గోల్స్ ను చెబుతున్నారా? సమస్యలో పడితే ఏం చేస్తారు? అడ్డంకులను ఎలా అధిగమిస్తారు? ఒత్తిడిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరా? లాంటి ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా ఆసక్తి చూపే అభ్యర్థులకు చాలా సేపు సమయాన్ని వెచ్చిస్తారు. ఎందుకంటే ఆరంభంలో సన్నద్ధమైన సమాధానాలే ఎక్కువగా ఉంటాయి. అనంతరం అంతర్గతంగా ఎలా ప్రవర్తిస్తారో తెలుస్తుంది. అందుకే మీకు మీరు స్వతంత్రంగా ఆలోచించగలరని నిరూపించాలి.
సెల్ఫ్ స్టార్టర్ అని తెలపాలి
ఆదర్శవంతమైన వర్కింగ్ రిలేషన్ షిప్ ఎప్పుడు ఉంటుందంటే.. అవతలి వ్యక్తికి స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛను ఇచ్చినప్పుడే కుదురుతుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే వారికి కంపెనీలు తీసుకునేందుకు ఆసక్తి కనపరుస్తాయి. చాలా వరకు, తమను తాము నిర్వహించడానికి చాలా తక్కువ పర్యవేక్షణ అవసరమయ్యే అభ్యర్థుల కోసం ఎదురు చూస్తారు. నిర్వాహకులు ఈ అంశాలను పరిశీలిస్తారు. అయితే ఉద్యోగులు సెల్ఫ్ స్టార్టరై ఉండడం అమూల్యమైన నైపుణ్యం.
నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి
నిర్వహకులు నైపుణ్యం కలిగిన వ్యక్తి కోసం చూస్తారు. అంతకుముందు అనుభవం తప్పనిసరిగా లేక్కలోకి తీసుకుంటారు. నిర్వాహకులు నైపుణ్యం కలిగిన వారికే ముందు ప్రాధాన్యత చేస్తారు. అందుకే వడపోత కార్యక్రమం ద్వారా అర్హత కలిగిన వారిని తీసుకుంటారు. మీరు ఏ పని చేస్తున్నారో వారికి తప్పనిసరిగా తెలియజేయాలి. అంతేకాకుండా పనిలో అనుభవాన్ని, నైపుణ్యాన్ని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది.