ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. పలు ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిజికల్, కెమికల్, బయాలజీ లేదా సెరాలజీలో ఈ పోస్టులున్నాయి. మొత్తం 58 ఖాళీలను ప్రకటించింది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 57 పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 2న ప్రారంభమైంది. అప్లై చేయడానికి నవంబర్ 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ http://slprb.ap.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
AP SLPRB Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే
- మొత్తం ఖాళీలు- 58
- సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్)- 18
- సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్)- 17సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ లేదా సెరాలజీ)- 22
- సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) లిమిటెడ్ రిక్రూట్‌మెంట్- 1
AP SLPRB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 2
- దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు
- రాతపరీక్ష- 2020 డిసెంబర్ 6 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
- దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300
- విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
AP SLPRB Recruitment 2020: అప్లై చేయండి ఇలా
- అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత అన్ని అర్హతలు ఉంటే http://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.
- http://slprb.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Recruitment పైన క్లిక్ చేయాలి.
- సైంటిఫిక్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కాలమ్‌లో సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ నింపాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.