Tuesday, November 3, 2020

Andhra Pradesh Aarogyasri Jobs

  NewNotifications       Tuesday, November 3, 2020

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఆరోగ్యశ్రీలో 648 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. జిల్లాలవారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 648 ఖాళీలను ప్రకటించింది. ఇందులో ఆరోగ్య మిత్ర పోస్టులు 590, టీమ్ లీడర్ పోస్టులు 58 ఉన్నాయి. జిల్లాలవారీగా వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా జిల్లాల అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ http://www.ysraarogyasri.ap.gov.in/ లో తెలుసుకోవచ్చు.

Andhra Pradesh Aarogyasri Jobs: ఆరోగ్య మిత్ర ఖాళీల వివరాలు ఇవే

ఆరోగ్య మిత్ర మొత్తం ఖాళీలు- 58

  • శ్రీకాకుళం- 14
  • విజయనగరం- 12
  • విశాఖపట్నం- 29
  • తూర్పు గోదావరి- 70పశ్చిమ గోదావరి- 24
  • కృష్ణా- 55
  • గుంటూరు- 65
  • ప్రకాశం- 54
  • నెల్లూరు- 44
  • చిత్తూరు- 68
  • వైఎస్ఆర్ కడప- 54
  • కర్నూలు- 57
  • అనంతపురం- 44

Andhra Pradesh Aarogyasri Jobs: టీమ్ లీడర్ ఖాళీల వివరాలు ఇవే

  • టీమ్ లీడర్ మొత్తం ఖాళీలు- 58
  • శ్రీకాకుళం- 1
  • విజయనగరం- 1
  • విశాఖపట్నం- 5
  • తూర్పు గోదావరి- 7
  • పశ్చిమ గోదావరి- 3
  • కృష్ణా- 7
  • గుంటూరు- 8
  • ప్రకాశం- 6
  • నెల్లూరు- 6
  • చిత్తూరు- 3
  • వైఎస్ఆర్ కడప- 2
  • కర్నూలు- 4
  • అనంతపురం- 5

Andhra Pradesh Aarogyasri Jobs: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తుకు చివరి తేదీ- వేర్వేరు జిల్లాల్లో చివరి తేదీ వేర్వేరుగా ఉంది. నోటిఫికేషన్ కోసం ఆయా జిల్లాల అధికారిక వెబ్‌సైట్ చూడాలి.
  • విద్యార్హతలు- బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ ఫార్మసీ, డీ ఫార్మసీ పాస్ కావాలి.
  • వేతనం- ఆరోగ్య మిత్రకు రూ.12,000. టీమ్‌ లీడర్‌కు రూ.15,000
  • దరఖాస్తు ఫీజు- లేదు
  • ఎంపిక విధానం- కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ.

logoblog

Thanks for reading Andhra Pradesh Aarogyasri Jobs

Previous
« Prev Post