IIT Hyderabad Recruitment 2020 | హైదరాబాద్‌లోని ఐఐటీ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటనెన్స్ డివిజన్‌లో ఈ పోస్టులు ఉన్నాయి.
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 5 చివరి తేదీ. నవంబర్ 5 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ https://iith.ac.in/ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.
3. మొత్తం ఖాళీలు 10 ఖాళీలు ఉంటే అందులో వర్క్ ఇన్‌స్పెక్టర్ (సివిల్)- 7, వర్క్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్)- 3 పోస్టులున్నాయి. ఎంపికైన వారికి రూ.30,000 వేతనం లభిస్తుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివి https://project.recruitment.iith.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
4. విద్యార్హతల వివరాలు చూస్తే వర్క్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి.
5. ఇక వర్క్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి.
6. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://project.recruitment.iith.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో PLEASE CLICK HERE TO START THE APPLICATION PROCESS పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. చివర్లో APPLY ONLINE పైన క్లిక్ చేయాలి. మెయిల్ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Notification