Monday, October 26, 2020

SSC Recruitment 2020

  NewNotifications       Monday, October 26, 2020
SSC Recruitment 2020: గుడ్ న్యూస్ ఇంటర్ పాసైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
SSC Recruitment 2020:

ఇంటర్ పాసయ్యారా? ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను 2020 నవంబర్ 6న రిలీజ్ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ అదే రోజున మొదలై 2020 డిసెంబర్ 15న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పలు ప్రభుత్వ విభాగాలు, సబార్డినేట్ ఆఫీసుల్లో లోయర్ డివిజనల్ క్లర్క్-LDC, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్-JSA, పోస్టల్ అసిస్టెంట్-PA, సార్టింగ్ అసిస్టెంట్-SA, డేటా ఎంట్రీ ఆపరేటర్-DEO పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 2 ఎగ్జామ్, టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఇంటర్ పాసైతే చాలు. అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండాలి.
SSC CHSL Recruitment 2020-21: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 6
దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 15కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ టైర్ 1 ఎగ్జామ్- 2021 ఏప్రిల్ 12 నుంచి 27
టైర్ 2 ఎగ్జామ్- డిస్క్రిప్టీవ్ పేపర్ ఉంటుంది. పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడిస్తుంది.
టైర్ 3- టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్.
SSC CHSL Recruitment 2020-21: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించలేదు. గతేడాది 4893 LDC, JSA, PA, SA, DEO పోస్టుల్ని భర్తీ చేసింది.
విద్యార్హత- ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 2 ఎగ్జామ్, టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ప్రతీ ఏటా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది. గత నోటిఫికేషన్ ద్వారా 1269 లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టులు, 3598 పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు, 26 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేసింది. ఈసారి కూడా అదే స్థాయిలో ఖాళీలను భర్తీ చేసే అవకాశముంది.
logoblog

Thanks for reading SSC Recruitment 2020

Previous
« Prev Post