డిప్లొమా పాసైనవారికి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులు ఉన్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు 2020 నవంబర్ 15 చివరి తేదీ. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS కింద బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్‌లో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇవి ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేసి, కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌కు పంపాలి. అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ అయిన http://www.mhrdnats.gov.in/ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
BEL Recruitment 2020: టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు ఉన్న బ్రాంచ్‌లు ఇవే
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్మెకానికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
కమర్షియల్ ప్రాక్టీస్
లైబ్రరీ సైన్స్
BEL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హత- మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ కావాలి. 2018 జనవరి 1 తర్వాత పాసైనవారు మాత్రమే అర్హులు.
స్టైపెండ్- నెలకు రూ.10,400
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 15
ఎంపిక విధానం- 10వ తరగతి, డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
DEPUTY MANAGER (HR/CLD)
CENTRE FOR LEARNING AND DEVELOPMENT
BHARAT ELECTRONICS LIMITED
JALAHALLI POST, BENGALURU – 560 013
Download the Official Notification