UCO Bank Jobs: యూకో బ్యాంకులో 91 ఉద్యోగాలు ఖాళీల వివరాలు ఇవే
యూకో బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ కేడర్ స్కేల్ 1, స్కేల్ 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెక్యూరిటీ ఆఫీసర్, ఇంజనీర్, ఎకనమిస్ట్, ఐటీ ఆఫీసర్, సీఏ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 91 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని పలు బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2020 అక్టోబర్ 27న దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 17 చివరి తేదీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ucobank.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
UCO Bank Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే.
- మొత్తం ఖాళీలు- 91
- సెక్యూరిటీ ఆఫీసర్- 9
- ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్)- 8ఎకనమిస్ట్- 2
- స్టాటిస్టీషియన్- 2
- ఐటీ ఆఫీసర్- 20
- ఛార్టర్డ్ అకౌంటెంట్- 50
UCO Bank Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 27
- దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 17
- అడ్మిట్ కార్డ్ రిలీజ్- త్వరలో వెల్లడించనున్న యూకో బ్యాంక్
- ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ లేదా 2021 జనవరి
- పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం
- విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
- దరఖాస్తు ఫీజు- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180.
UCO Bank Recruitment 2020: అప్లై చేయండి ఇలా
- అభ్యర్థులు ముందుగా https://www.ucobank.com/ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో careers సెక్షన్‌లో recruitment opportunities పైన క్లిక్ చేయాలి.
- వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీరు దరఖాస్తు చేయాలనుకునే లింక్ పైన క్లిక్ చేయాలి.
- మీ పేరు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.