UPSC CDS (I) 2021 Notification | ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం మీ కలా-నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు, అర్హతల వివరాలు తెలుసుకోండి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ప్రతీ ఏటా రెండు సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. 2021 ఏడాదికి సంబంధించి మొదటి నోటిఫికేషన్ విడుదలైంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS 1 ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది యూపీఎస్‌సీ. మొత్తం 345 పోస్టుల్ని ప్రకటించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా డిఫెన్స్‌లోని ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న అకాడమీల్లో ఈ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. UPSC CDS 1 2021 నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాత https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.
UPSC CDS (I) 2021 Notification: ఖాళీల వివరాలు ఇవే
- మొత్తం ఖాళీలు- 345
- ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100
- ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 26ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు)- 170
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు)- 17
UPSC CDS (I) 2021 Notification: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- నోటిఫికేషన్ విడుదల- 2020 అక్టోబర్ 28
- దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 28
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 17 సాయంత్రం 6 గంటలు
- దరఖాస్తుల విత్‌డ్రా: 2020 నవంబర్ 24 నుంచి నవంబర్ 30 సాయంత్రం 6 గంటలు
- అడ్మిట్ కార్డుల విడుదల- ఎగ్జామ్‌కు మూడు వారాల ముందు
- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్- 2021 ఫిబ్రవరి 7
- విద్యార్హత- ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నై కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
- దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
UPSC CDS (I) 2021 Notification: అప్లై చేయండి ఇలా
- అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Combined Defence Services Examination (I) నోటిఫికేషన్ కనిపిస్తుంది.
- Part-I Registration రిజిస్ట్రేషన్ చేసేందుకు లింక్ పైన క్లిక్ చేయాలి.
- మీ వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- ఆ తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేసి పూర్తి చేయాలి.
- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.