Friday, October 30, 2020

IBPS RRB Recruitment 2020

  NewNotifications       Friday, October 30, 2020

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS కొద్ది రోజుల క్రితం రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ముగిసింది.

IBPS RRB Recruitment 2020

అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అనేకమంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయలేకపోయారు. వారికి ఐబీపీఎస్ మరో అవకాశం ఇస్తోంది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ -I, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేసేందుకు అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9640 పోస్టుల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్)- 4624, ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)- 3800 పోస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా 8424 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఐబీపీఎస్. అప్లికేషన్ విండోను అక్టోబర్ 26న ఓపెన్ చేసింది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 9 చివరి తేదీ. 2020 నవంబర్ 9 నాటికి విద్యార్హతలు పొందిన వారు, 2020 జూలై 1 నుంచి 21 వరకు దరఖాస్తు చేయలేకపోయినవారు ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా చదివిన తర్వాతే అప్లై చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

IBPS RRB Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే

  • మొత్తం ఖాళీలు- 8424
  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్)- 4624
  • ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)- 3800

IBPS RRB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 26
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 9
  • ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 9
  • అప్లికేషన్ సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 9
  • అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 9
  • అడ్మిట్ కార్డుల విడుదల- పరీక్షకు 10 రోజుల ముందు
  • ఆఫీసర్ స్కేల్-I ప్రిలిమినరీ పరీక్ష- 2020 డిసెంబర్ 31
  • ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) ప్రిలిమినరీ పరీక్ష- 2021 జనవరి 2 లేదా 4

IBPS RRB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • వయస్సు- ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్ I పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు.
  • ఎంపిక విధానం- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.
  • దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.180.

logoblog

Thanks for reading IBPS RRB Recruitment 2020

Previous
« Prev Post