Tuesday, November 24, 2020

Easy way to gas booking process

  NewNotifications       Tuesday, November 24, 2020
Indane Gas: ఇండేన్ గ్యాస్ బుక్ చేయడానికి SMS పంపండి ఇలా
Indane Gas Cylinder Booking SMS  గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేదా? ఇంటర్నెట్ కూడా లేదా? ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి
 గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి అనేక పద్ధతులున్నాయి. మీరు ఓ ఎస్ఎంఎస్ పంపి గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ సర్వీస్ అందిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

మీరు ఎస్ఎంఎస్ సదుపాయం ఉపయోగించాలంటే ముందుగా రిజిస్టర్ చేయాలి. ఇందుకోసం IOC అని టైప్ చేసి STD Code తో పాటు డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ నెంబర్, కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు DISTRIBUER HELPLINE NUMBER 23110572, STD CODE 040. CONSUMER NUMBER 12345678 అనుకుందాం. అప్పుడు IOC 04023110572 12345678 అని టైప్ చేసి స్థానిక ఐవీఆర్ఎస్ నెంబర్‌కు మెసేజ్ పంపాల్సి ఉంటుంది.

 గతంలో ఐవీఆర్ఎస్ నెంబర్లు వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరుగా ఉండేవి. కానీ నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే ఐవీఆర్ఎస్ నెంబర్ 7718955555 ప్రారంభించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆ తర్వాత నుంచి IOC అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఐవీఆర్ఎస్ నెంబర్‌‌కు మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ అవుతుంది.

Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్ఎలా చేయాలంటేఒకవేళ మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నట్టైతే వాట్సప్‌లో ఓ మెసేజ్ పంపించడం ద్వారా ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.

7588888824 నెంబర్‌కు వాట్సప్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌లో 7588888824 నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత ఇదే నెంబర్ సెర్చ్ చేసి ఛాట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Refill అని టైప్ చేసి మెసేజ్ పంపిస్తే చాలు సిలిండర్ బుక్ అవుతుంది. ఈ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది.

logoblog

Thanks for reading Easy way to gas booking process

Previous
« Prev Post