Wednesday, November 4, 2020

Bank Jobs 2020 12588 posts

  NewNotifications       Wednesday, November 4, 2020

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS మూడు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 12,588 బ్యాంకు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం మీ కలా? బ్యాంకింగ్ జాబ్స్ కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ నిర్వహించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. లేటెస్ట్‌గా మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 12,588 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఆఫీసర్ స్కేల్ -I, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్), స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనెరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఈ పోస్టులున్నాయి. ఈ మూడు నోటిఫికేషన్లకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.

మొత్తం 3517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో విడుదల చేసిన 1167 పోస్టులకు ఇది అనుబంధ నోటిఫికేషన్. అప్లై చేయడానికి 2020 నవంబర్ 11 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక 8424 ఆఫీసర్ స్కేల్ -I, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. గతంలోనే 9640 ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరించింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అప్లైచేయలేనివారికి మరో అవకాశం ఇస్తూ అప్లికేషన్ విండో మళ్లీ ఓపెన్ చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక 647 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ లాంటి పోస్టలున్నాయి. 2020 నవంబర్ 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

మొత్తం మూడు నోటిఫికేషన్ల ద్వారా 12,588 బ్యాంకు ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ మూడు నోటిఫికేషన్లలో వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అందుకే సంబంధిత నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయాలి.

logoblog

Thanks for reading Bank Jobs 2020 12588 posts

Previous
« Prev Post