Saturday, October 3, 2020

Indian coastguard general duty jobs

  NewNotifications       Saturday, October 3, 2020

Indian coastguard general duty jobs

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగం అంటేనే గౌరవంతో పాటు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది.Edu news అలాగే మంచి వేతనం సైతం ఉంటుంది. అందులో జనరల్ డ్యూటీ/పైలట్ నేవిగేటర్ ఎంట్రీకి.
జనరల్ డ్యూటీ జాబ్స్

సంబంధించి అర్హత, ఇతర వివరాలు తెలుసుకోండిలా
ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయో పరిమితి: 19-25 ఏళ్లు.
శిక్షణ: ఈ విభాగంలో ఆఫీసర్ హోదా అందుకోవాలంటే.. వాచ్ కీపింగ్ సర్టిఫికెట్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాచ్ కీపింగ్ సర్టిఫికెట్ దక్కించుకున్న వారికి ఎయిర్‌ఫోర్స్ అకాడమీ లేదా సివిల్ ఫ్లయింగ్ అకాడమీలలో ఫేజ్-1 కింద ఆరు నెలలు శిక్షణనిస్తారు. ఆ తర్వాత దశలో కోస్ట్‌గార్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్రన్(డామన్) లేదా హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ రాజాలిలో శిక్షణ ఉంటుంది. వీటిని విజయవంతంగా పూర్తి చేసుకుంటే వింగ్ ఆఫీసర్స్‌గా నియామకం ఖరారు చేస్తారు.

కమర్షియల్ పైలట్ లెసైన్స్
ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ గుర్తింపుపొందిన సంస్థ నుంచి కమర్షియల్ పైలట్ లెసైన్స్ కలిగుండాలి.
వయో పరిమితి: 19-25 ఏళ్లు.
శిక్షణ: ఈ విభాగం అభ్యర్థులు ముందుగా ఐఎన్‌ఏ ఎజిమలలో నావెల్ ఓరియెంటేషన్ కోర్సును పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోస్ట్‌గార్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్రన్(డామన్) లేదా హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ రాజాలిలో ఆరు నెలల వ్యవధిలో శిక్షణ పూర్తి చేసుకోవాలి
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://joinindiancoastguard.gov.in/
logoblog

Thanks for reading Indian coastguard general duty jobs

Previous
« Prev Post