నిరుద్యోగులకు శుభవార్త BEL నుంచి మరో నోటిఫికేషన్.. వివరాలివే..
నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) శుభవార్త చెప్పింది. ఘజియాబాద్(Ghaziabad) యూనిట్ లో తొమ్మిది మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది
నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) శుభవార్త చెప్పింది. ఘజియాబాద్(Ghaziabad) యూనిట్ లో తొమ్మిది మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఎంపికైన వారికి ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుందని సంస్థ తెలిపింది. ట్రైనింగ్ ను మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 10 వేలు స్కాలర్ షిప్ గా అందించనున్నట్లు తెలిపింది. రెండో సంవత్సరం నెలకు రూ. 12 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నట్లు వెల్లడించింది.
ఎవరు దరఖాస్తు చేయాలంటే
CA, ICWA(Intermediate) ఫూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. 25 ఏళ్ల లోపు వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, SC, ST, PWD అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.
ఎలా దరఖాస్తు చేయాలంటే
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో డిసెంబర్ 25కు లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను tgtgad@bel.co.in మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది. మెయిల్ కు సబ్జెక్ట్ గా “MIT (Finance) trainee” ఉంచాలని సూచించారు. దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా మాత్రమే పంపిచాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. CA, ICWAలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మెయిల్ ద్వారానే సమాచారం ఇస్తారు