SSC Recruitment 2020-డిప్లొమా, బీటెక్ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.
డిప్లొమా, బీటెక్ పాసైన విద్యార్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో ఉద్యోగం సంపాదించడానికి మంచి అవకాశమిది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి విభాగాల్లో డిప్లొమా లేదా బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇవి గ్రూప్ బీ (నాన్ గెజిటెడ్) పోస్టులు. 7వ పే కమిషన్ వర్తిస్తుంది. ఖాళీల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించలేదు. త్వరలో ఖాళీల సంఖ్య వెల్లడిస్తుంది. ఖాళీల సంఖ్య తెలుసుకోవాలనుకుంటే అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Candidates Corner పైన క్లిక్ చేసి Tentative Vacancy ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. అందులో జూనియర్ ఇంజనీర్ ఖాళీలకు సంబంధించిన వివరాలు అప్‍డేట్ అవుతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 30 చివరి తేదీ.
SSC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 1
- దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 30 రాత్రి 11.30 గంటలు
- ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ- 2020 నవంబర్ 1 రాత్రి 11.30 గంటలు
- ఆఫ్‌లైన్ చలాన్ జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 3 రాత్రి 11.30 గంటలు
- చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 5 రాత్రి 11.30 గంటలు
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2021 మార్చి 22 నుంచి మార్చి 25
- పేపర్ 2 పరీక్ష నిర్వహించే తేదీ- త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- విద్యార్హతలు- సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచ్‌లల్లో డిప్లొమా లేదా డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
- వయస్సు- గరిష్టంగా 32 ఏళ్లు. కొన్ని పోస్టులకు 30 ఏళ్ల లోపే. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
- పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.