If you are a student apply for a pan card there are a lot of benefits
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారికి, భారీ లావాదేవీలు చేసేవారికి మాత్రమే పాన్ కార్డు అవసరం అనుకుంటున్నారు. విద్యార్థులు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. స్టూడెంట్స్ పాన్ కార్డ్ తీసుకుంటే లాభాలేంటో తెలుసుకోండి.
1.భారత అధికారిక గుర్తింపు కార్డుల్లో పాన్ కార్డ్ ఒకటి. ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉంటుంది. కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే పాన్ అవసరం అనే భ్రమలో ఉంటారు చాలా మంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ పాన్ కార్డు తప్పనిసరైంది. ఇది గుర్తింపు కార్డుగానే కాదు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు పాన్ కార్డ్ కలిగి ఉండటం ఎంతో అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
2.బ్యాంకు లోన్ తీసుకొని దేశ విదేశాలల్లో ఉన్నత విద్యనభ్యుసించాలనుకునే విద్యార్థులకు పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. పాన్ కార్డును 18 ఏళ్లు నిండిన మేజర్లే కాదు మైనర్లు కూడా కలిగి ఉండవచ్చు. విద్యార్థులు దీన్ని పాఠశాల గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల, పాఠశాల విద్యార్థులు సైతం భవిష్యత్ అవసరాల దృష్ట్యా పాన్ కార్డును కలిగి ఉండటం ఉత్తమం.
3.పాన్ కార్డును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ పర్యవేక్షణలో భారత ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో UTIITSL, NSDL వెబ్‌సైట్స్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
4.ముందుగా NSDL లేదా UTIISL రెండు ప్లాట్‌ఫామ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా www.tin.tin.nsdl.com/pan/index.html లేదా www.myutiitsl.com/PANONLINE వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
5.కొత్త దరఖాస్తుదారులైతే, మీరు ఫారం 49ఎ నింపాల్సి ఉంటుంది. అవసరమైన సమాచారాన్ని జాగ్రత్తగా నింపి, సబ్మిట్ చేయాలి. దీంతో దరఖాస్తుదారుడుకి 15-అంకెల రసీదు సంఖ్యను అలాట్ చేయబడుతుంది.
6.దరఖాస్తుదారు పాన్ కార్డు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు జీఎస్టీతో కలిపి రూ.110 చెల్లించాలి. రెండు- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అవసరమైన సంతకాలు లేదా వేలి ముద్రతో పాటు రసీదు కాపీతో ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పుట్టిన తేదీ ఫ్రూఫ్ మరియు పాన్ కార్డు ఫీజు చెల్లించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్‌ని అటాచ్ చేసి ఆదాయపు పన్ను శాఖకు పంపించాలి.
7.దరఖాస్తు ఫామ్ సమర్పించిన 15 రోజుల్లోపు దరఖాస్తుదారు ఆదాయపు పన్ను కార్యాలయానికి డాక్యుమెంట్స్ చేరాయో లేదో నిర్ధారించుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్స్ ఆదాయపు పన్ను కార్యాలయానికి చేరుకున్న తరువాత సిబిడిటి పర్యవేక్షణలో ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. పైన పేర్కొన్న విధానంలోనే దరఖాస్తుదారుడు వారి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. మార్పులు, చేర్పులు చేసిన తర్వాత దరఖాస్తుదారుడు “పాన్ వివరాలలో మార్పులు లేదా దిద్దుబాటు” పై క్లిక్ చేయాలి.
8.ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లో కూడా పాన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఫారం 49 ఎ దరఖాస్తు పత్రాన్ని నింపి సంబంధిత డాక్యుమెంట్స్‌ని జతచేసి దరఖాస్తు చేయాలి. ఆఫ్లైన్లో పాన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ పరిశీలిద్దాం.
9.NSDL లేదా UTIITSL వెబ్‌సైట్ నుండి ఫారం 49A యొక్క కాపీని డౌన్‌లోడ్ చేయండి. దరఖాస్తు దారుడి వయస్సును బట్టి, ఫారమ్‌లో ఇచ్చిన విధంగా మైనర్ పాన్ కార్డుపై టిక్ చేయండి. ఫామ్‌ను జాగ్రత్తగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్తో పాటు సంతకం చేయాలి. లేదా సమీప టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో వేలిముద్ర వేసి దరఖాస్తును సమర్పించాలి. సంబంధిత అధికారులు ధృవీకరించిన తరువాత పాన్ కార్డును భారత ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది.
10.పాన్ కార్డ్ పొందడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఐదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనగా పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, రేషన్ కార్డ్, బ్రాంచ్ మేనేజర్ చేత సంతకం చేసిన బ్యాంక్ సర్టిఫికేట్లలో ఏదైనా ఒకటి సమర్పించొచ్చు.
11.రెసిడెన్సీ ప్రూఫ్‌గా- పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, రేషన్ కార్డ్, బ్రాంచ్ మేనేజర్ చేత సంతకం చేసిన బ్యాంక్ సర్టిఫికేట్, కనీసం మూడు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్, విద్యుత్, గ్యాస్ కనెక్షన్, టెలిఫోన్ బిల్లు (3 నెలలకు మించకూడదు) దరఖాస్తుదారుడి చిరునామాను కలిగి ఉన్న పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయవచ్చు.