Saturday, October 3, 2020

ICMR Jobs

  NewNotifications       Saturday, October 3, 2020

నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ -- ICMR ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ICMR_Jobs

1.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్‌ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 141 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

2.న్యూ ఢిల్లీలోని ఐసీఎంఆర్, చండీగఢ్‌లోని PGIMER సంయుక్తంగా రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. న్యూ ఢిల్లీలోని ఐసీఎంఆర్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఐసీఎంఆర్ కేంద్రాలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈ పోస్టులున్నాయి.

3.మొత్తం 141 పోస్టులు ఉండగా అందులో సైంటిస్ట్ బీ మెడికల్- 72, సైంటిస్ట్ బీ నాన్ మెడికల్- 69 పోస్టులున్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.icmr.gov.in/ లేదా https://pgimer.edu.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

4.ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 2 చివరి తేదీ. అడ్మిట్ కార్డ్ 2020 అక్టోబర్ 20న విడుదలవుతుంది. 2020 నవంబర్ 1న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 2020 నవంబర్ 20న ఫలితాల విడుదలౌతాయి.

5.విద్యార్హత వివరాలు చూస్తే మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ కావాలి. నాన్ మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు లోపు ఉండాలి.

6.దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలకు రూ.1500. ఇతరులకు రూ.2000. ఎంపికైన వారికి రూ.1,70,000 వేతనం లభిస్తుంది.

logoblog

Thanks for reading ICMR Jobs

Previous
« Prev Post