Tuesday, October 6, 2020

ESI Hyderabad Recruitment 114 posts

  NewNotifications       Tuesday, October 6, 2020

ESI Hyderabad Recruitment @ 114 posts

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 114 పోస్టుల్ని ప్రకటించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
ESI Hyderabad Jobs
Source:News18
1. నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 114 పోస్టుల భర్తీ జరుగుతోంది. కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 11 చివరి తేదీ.
2. మొత్తం 114 ఖాళీలు ఉండగా అందులో కన్సల్టెంట్ (జనరల్ మెడిసిన్)- 2, కన్సల్టెంట్ (పల్మనాలజిస్ట్)- 2, కన్సల్టెంట్ (క్రిటికల్ కేర్)- 4, సీనియర్ రెసిడెంట్ (బ్రాడ్ స్పెషాలిటీస్)- 46, జూనియర్ రెసిడెంట్ (బ్రాడ్ స్పెషాలిటీస్)- 60 పోస్టులున్నాయి.
3. సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారికి మూడేళ్ల అనుభవం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పాసైనవారికి 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. 
4. ఈ పోస్టులకు అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించనుంది ఈఎస్ఐసీ. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి.
5. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఈఎస్ఐ అభ్యర్థులకు ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
logoblog

Thanks for reading ESI Hyderabad Recruitment 114 posts

Previous
« Prev Post